స్విమ్మర్ రాజుకు" జెర్సీ"ని అందించిన సీపీ తరుణ్ జోసి

పలు సామాజీక సేవలందించిన వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు ( స్విమ్మర్ రాజు )కు జెర్సీ ని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అందజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ ఎమ్ రేడియో

పలు సామాజీక సేవలందించిన వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు ( స్విమ్మర్ రాజు )కు జెర్సీ ని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అందజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ ఎమ్ రేడియో వరంగల్ వారి ఆధ్వర్యంలో ... సాహో సన్రైజర్స్ అనే కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ పోలీస్ హెడ్ క్వాటర్స్ లో ఏ.ఆర్ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఖానాపురం మండలం రాగంపేట గ్రామానికి చెందిన కన్నె రాజు ( స్విమ్మర్ రాజు ) కరోన సమయంలో రక్తదానం , ప్లాస్మాదానం , అన్నదానం , తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం , కొవిడ్ -19 సమయంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను వారి పేర్లతో లిఖించిన ఎస్ ఆర్ ఎచ్ జెర్సీలను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఐపీఎస్ చేతుల మీదుగా అందుకున్నారు. కొవిడ్ -19 సమయంలో అత్యుత్తమ సేవలు అందించిన , పోలీసులు , డాక్టర్స్ , పారిశుద్ధ కార్మికులు , వివిధ స్వచ్ఛంద కు చెందిన ఫ్రంట్లైన్ వారియర్స్ కి వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఫ్రంట్లైన్ వారియర్స్ సాహో సన్రైజర్స్ కార్యక్రమంలో హనుమకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి , డాక్టర్ శ్రీనివాస్ వర్మ ,డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ,ఎస్ ఐ వీరేందర్, వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు ( స్విమ్మర్ రాజు ) , ఆశ వర్కర్స్ రజిత , సరస్వతి, ప్రవళిక, ఎం రాజు, ఎల్లయ్య లకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెడ్ ఎఫ్ ఎమ్ నుండి అర్జీ విక్కీ , సుబోధ, శ్రీనివాస్ రాజేష్ ,మధు పాల్గొన్నారు.

mallesh Reporter

Comment As:

Comment (0)